హత్య కేసులో మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ !

-

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే,  తెలుగుదేశం పార్టీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు కోడి సేపటి క్రితం అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డికి బావ వరుస అయిన సత్తిరాజు రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో సత్తిరాజు రెడ్డి రెండో భార్య.. తన భర్త హత్య వెనుక రామకృష్ణా రెడ్డి కుట్ర ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోంది. ఈ తరుణంలో ఈ రోజు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక రామకృష్ణా రెడీ అరెస్టుతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అరెస్ట్ అయ్యాక ఆయనని తీసుకు వెళ్ళకుండా పోలీసులను టీడీపీ కార్యకర్తలు నిలువరించారు. ఇక చంద్రబాబు కూడా ఇది అక్రమ అరెస్ట్ అని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, ఇంతకింత అనుభవిస్తారని అన్నారు. ఆయన మీద పెట్టిన అక్రమ కేసు ఎత్తి వేయాలని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news