జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ కారణంగా కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే భావన ఆ పార్టీ వర్గాలలో ఎక్కువగా ఉంది. కొంతమంది నేతల మాట అసలు నాదెండ్ల మనోహర్ వినడంలేదు. జనసేన అధినేత చెప్పినా సరే ఆయన పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. పవన్ కళ్యాణ్ వద్ద తనకు కాస్త ఎక్కువగా స్వేచ్చ ఉండటంతో నాదెండ్ల మనోహర్ కొన్ని కొన్ని కీలక నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో కొన్ని కీలక మార్పులు కూడా జరిగాయి. ఈ మార్పులన్నీ కూడా నాదెండ్ల మనోహర్ కనుసన్నల్లో జరిగాయన్న టాక్ ఉంది. జనసేన పార్టీలో ముందునుంచి ఉన్న సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కూడా తమకు చెప్పకుండానే మార్పులు చేశారని కొంత మంది పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మనోహర్ విషయంలో గుంటూరు జిల్లాలో నేతలు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది నేతలు కనీసం పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యలను కూడా తీసుకువెళ్ళలేని స్థితిలో ఉన్నారు. తానే జనసేనలో సుప్రీం అనే పరిస్థితికి నాదెండ్ల మనోహర్ గా వచ్చేశారట. దీంతో ఇప్పుడు జనసేన పార్టీలో క్రమంగా చిలికలు వస్తున్నాయని ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గమనించలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ కు సూచిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ సమస్యల మీద ఎంత వరకు దృష్టి పెడతారు అనేది చూడాలి.