నేను భయపడేదాన్ని కాదు.. కోర్టు వెళతాను : మీడియాకు అనసూయ వార్నింగ్

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ మీడియా మరియు సోషల్‌ మీడియాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాన పై దారుణంగా వార్తలు రాస్తున్నారని… అసలు తాను అనని మాటలు కూడా మీడియా మరియు సోషల్‌ మీడియా లో వేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో…. థంబ్‌ నెల్స్‌ పెట్టి… తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు యాంకర్‌ అనసూయ.

తాను ఓటమికి భయపడే పిరికి దాన్ని కాదని… తానేమీ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేయనన్నారు అనసూయ. నిన్న మీడియాలో తాను భారీ మెజారిటీ తో గెలుస్తున్నానని.. వార్తలు వచ్చాయని.. కానీ ఇప్పుడు తాను ఓడిపోయానని చెప్పారు. ఇక నుంచి తానపై తప్పుడు వార్తలు రాస్తే… కోర్టుకు వెళతానని హెచ్చరించారు అనసూయ. కాగా… కాసేపటి క్రితమే.. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించి…. గెలిచిన 11 మంది సభ్యులు మా కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే యాంకర్‌ అనసూయ మీడియాపై ఫైర్‌ అయ్యారు.