గర్భవతిగా అనసూయ.. థ్యాంక్యూ బ్రదర్ ఫస్ట్ లుక్ విడుదల..

-

బుల్లితెర సంచలనం అనసూయ వెండితెర మీద కూడా అదే సంచలనాన్ని చూపిస్తుంది. రంగమ్మత్తగా అందరికీ గుర్తుండిపోయే పాత్ర చేసిన అనసూయ, తాజాగా థ్యాంక్యూ బ్రదర్ సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుంది. థ్యాంక్యూ బ్రదర్ ఫస్ట్ లుక్ నేడే విడుదల అయింది. సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. గర్భిణిగా కనిపించిన అనసూయ తన కళ్ళలో సీరియస్ నెస్ నింపుకుని ఉంది.

అనసూయ పక్కన నిల్చున్న అశ్విన్ విరాజ్ కళ్ళలోనూ అదే లుక్ కనబడుతుంది. రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జస్ట్ ఆర్డినరీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందింది. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారట. మరి థ్యాంక్యూ బ్రదర్ సినిమాతో అనసూయ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news