డప్పు పాటతో మోత మోగించనున్న యాంకర్ అనసూయ..

Join Our Community
follow manalokam on social media

యాంకర్ అనసూయ సినిమాల్లో నటిస్తూ తన గ్లామర్ తో వెండితెరకి సరికొత్త సొగసుని తీసుకువస్తుంది. అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర, సినిమాల్లో ఆమె కెరీర్ కి మంచి ప్లస్ గా నిలిచింది. నటన పరంగానే కాకుండా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ కుర్రకారుని కిర్రెక్కిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా అనసూయ మరో ప్రత్యేక గీతంలో నర్తించనుంది. ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ హీరోగా నటిస్తున్న చావు కబురు చల్లగా సినిమాలో హీరోతో కలిసి స్టెప్పులేయనుంది.

ఈ మేరకు ఈ పాటలోని కొన్ని స్టిల్స్ బయటకి వచ్చాయి. చేతిలో డప్పు పట్టుకుని, గులాబీ రంగు చీర కట్టుకుని, మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తూ ఉంది. ఆల్రెడీ చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటని మరికొద్ది రోజుల్లో విడుదల చేస్తారట. ఈ పాటకి అనసూయ బాగానే డిమాండ్ చేసిందని టాక్. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కనిపిస్తున్న చావు కబురు చల్లగా సినిమాని జీఏ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించనుండగా కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చ్ 19వ తేదీన చావు కబురు చల్లగా సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...