మెగా కోడలిగా మారనున్న యాంకర్ మేఘన.. ఫొటోస్ వైరల్..!

-

యాంకర్ మేఘన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు కామెడీ ప్రోగ్రామ్లకు యాంకర్ గా తనదైన స్టైల్ లో వ్యవహరించి మంచి క్రేజ్ ను కూడా సంపాదించింది. అంతేకాదు గ్లామర్ షో క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల వరుసగా బుల్లితెర షో లలో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ తాజాగా ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈమె ప్రేమలో ఉన్నది ఏకంగా మెగా ఫ్యామిలీ వారసుడు అని తెలిసేసరికి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్య పోవడమే కాదు అందరూ ఈమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

ఇంతకీ మేఘన ఎవరితో ప్రేమలో పడింది.. ఎవరిని ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇంతకు ఆ మెగా ఫ్యామిలీకి చెందిన హీరో ఎవరు అనే విషయానికి వస్తే మెగా ఫ్యామిలీకి చెందిన అప్ కమింగ్ హీరో పవన్ తేజ్ కొణిదెల.. ఇక తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం కూడా చేశారు . ఇరువురు కుటుంబ సభ్యులు. ఇక వీరి నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కొనిదెల కూడా హాజరయ్యారు. ఆశీస్సులు కూడా అందించారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి మరికొంతమంది సభ్యులు హాజరవడం జరిగింది. చిరంజీవికి సోదరుడి కుమారుడైన పవన్ తేజు కొణిదెలతో మేఘన నిశ్చితార్థం జరగడంతో ఈ బుల్లితెర యాంకర్ మెగా ఫ్యామిలీ కోడలు అవుతోంది.. ఇక ఈ వార్తతో మెగా అభిమానులు అందరూ ఈమెకు ఆల్ ద బెస్ట్ కూడా చెబుతున్నారు.ఘనంగా పవన్ తేజ్ కొణిదెల నిశ్చితార్థం, వైరల్ అవుతున్న ఫోటోలు..! - Filmy Focus

ఇకపోతే మేఘన తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేయాగా అవి బాగా వైరల్ అవుతున్నాయి. ఇక అంతేకాదు కింద క్యాప్షన్ సురేఖ ఆంటీ విలువైన ఆశీర్వాదాలు మాకు లభించాయి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఈ నిశ్చితార్థ వేడుకకు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు బుల్లితెర నటీనటులు కూడా హాజరయ్యారు. అలాగే సుమ, రాజీవ కనకాల కూడా హాజరవడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news