సుధీర్ అయిపోయాడు.. ఇప్పుడు ప్ర‌దీప్ ఎంట్రీనా..?

-

తెలుగు బుల్లితెర హిస్టరీలో కొంత మంది మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి వారిలో చాలా కాలం నుంచి యాంకరింగ్‌లో తనదైన ముద్రను వేస్తున్న ప్రదీప్ మాచిరాజు ఒకడు. పలు టీవీ షోలలో ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇటు స్టేజ్ పై తోటి సభ్యులు .. అటు ఆడియన్స్ ఎవరూ హర్ట్ కాకుండా మంచి సమయస్ఫూర్తితో మాట్లాడటం ప్రదీప్ ప్రత్యేకత. ఇలా బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యాంకర్ గా ప్రదీప్ కనిపిస్తాడు. కొన్నేళ్లుగా ఎన్నో టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ టీవీ రంగంలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతడు చాలా షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

అయితే అలాంటి ప్రదీప్ కి మంచి క్రేజ్ తెచ్చిన షోలలో ‘ఢీ’ ఒకటి. ఆ షో నుంచి ప్రదీప్ తప్పుకున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. వచ్చేవారానికి సంబంధించిన ప్రోమోలో ప్రదీప్ కనిపించకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ప్రదీప్ హీరోగా ఒక సినిమా రూపొందనుంది. ఆ సినిమా షూటింగు కారణంగానే ఆయన ఈ షో నుంచి తప్పుకున్నాడని అంటున్నారు. ఇప్పటివరకూ వెండితెరపై చిన్నచిన్న పాత్రలతో మెరుస్తూ వచ్చిన ప్రదీప్, త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. కాగా, ఇటీవ‌ల సుధీర్ కూడా హీరో అదృష్టాన్ని ప‌రిక్షించుకున్నాడు కానీ స‌క్సెస్ కాలేక‌పోయారు. మ‌రి ప్ర‌దీప్ ఎంద వ‌ర‌కు సక్సెస్ అవుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news