అమరావతి సెగ.. క్షమాపణలు చెప్పిన యాంకర్‌ ప్రదీప్‌

టీవీ యాంకర్‌ ప్రదీప్‌ మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రదీప్‌ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై రంగంలోకి దిగిన ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికలపూడి శ్రీనివాసరావు… ప్రదీప్‌ ను తీవ్రంగా హెచ్చరించారు. ప్రదీప్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోని.. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ప్రదీప్‌ ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఈ ఘటనపై ఎట్టకేలకు యాంకర్‌ ప్రదీప్‌ దిగివచ్చాడు.

ఈ వివాదంపై స్పందించిన ప్రదీప్‌.. వారికి క్షమాపణలు చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా తాను అలా మాట్లాడలేదని.. ప్రేక్షకుల ఎంటర్‌ టైన్‌మెంట్‌ కోసమే..తాను అలా మాట్లాడనని ప్రదీప్‌ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు వల్ల బాధపడ్డవారికి క్షమాపణలు అంటూ పేర్కొన్నాడు యాంకర్‌ ప్రదీప్‌. ప్రదీప్ క్షమాపణలు చెప్పడంపై ఏపీ పరిరక్షణ సమితి ఇంకా స్పందించలేదు.