బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. దాంతో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టాప్ 5 లోకి సింగర్ శ్రీరామచంద్ర చేరుకున్నారు. మరోవైపు ఈ వారం ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ట్విస్ట్ జరగనుంది అంటూ వార్తలు వస్తున్నాయి. గత వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే యాంకర్ రవి ఎలిమినేషన్ ను ఆయన అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
అంతేకాకుండా తెలంగాణ జాగృతి సభ్యులు అన్నపూర్ణ స్టూడియోను ముట్టడించారు. కాజల్ ప్రియాంక సింగ్ లాంటి కంటెస్టెంట్ లు రవి కంటే వీక్ అని తాము రవికి ఎంతో సపోర్ట్ చేశామని అలాంటప్పుడు రవి ఎలా ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ యాజమాన్యం రవి రీ ఎంట్రీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రవి రీ ఎంట్రీ ఉంటే రేపు ఆదివారం క్లారిటీ వచ్చే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బిగ్ బాస్ గత సీజన్ లలో యాంకర్ శ్యామల, అలీ రెజా కూడా ఇదే విధంగా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.