అందాల స్రవంతి.. అందమే తింటున్నట్లుదిగా..?

యంగ్ యాంకర్ స్రవంతి ప్రశాంత్ సోషల్ మీడియా వేదికగా సెగలు రేపుతోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. అమ్మడు అందాల జడిలో నెటిజెన్స్ తడిసిపోతూనే.. తమ క్రేజీ కామెంట్స్ తో అమ్మడు పై అభిమానం చాటుకుంటున్నారు.

వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలు గల్లంతు కావడంతో గ్లామర్ నే నమ్ముకొని ముందుకు వెళుతుంది స్రవంతి ప్రశాంత్. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన స్రవంతి ప్రశాంత్ మొదట్లో కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించింది. తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమవ్వాలని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు.

మధ్యలో, ఆమె కొన్ని చిత్రాల్లో నటించినా అవి రిలీజ్ కాలేదు. దాంతో స్రవంతి ప్రశాంత్ హీరోయిన్ గా చేశారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. హీరోయిన్ నుంచి సపోర్టింగ్ రోల్స్ కి కెరీర్ పడిపోవడంతో చేసేదేమి లేక ఇక బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది.

అనసూయ, రష్మీ వంటి యాంకర్స్ స్ఫూర్తితో గ్లామరస్ యాంకర్ గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తుంది. కానీ వాళ్ళకు వచ్చిన క్రేజ్ స్రవంతి ప్రశాంత్ కి రావడం లేదు. ప్రోగ్రామ్స్ కూడా అంతంత మాత్రమే. ఆ మధ్య బిగ్ బాస్ షో ద్వారా ఒకింత వెలుగులోకి వచ్చింది అనుకుంటే అమ్మడు క్రేజ్ అంతలోనే మాయం అయిపోయింది.