బిగ్ బాస్ షోపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు.. ముదురుతున్న వివాదం..!

347

ఎన్నో వివాదాల మధ్య బిగ్ బాస్ సీజన్ 3 ఈనెల 21న ప్రారంభం కానుంది. అయితే.. తాజాగా బిగ్ బాస్ షోపై యాంకర్ శ్వేతారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బిగ్ బాస్ సీజన్ 3.. ప్రారంభం కాకముందే ఎన్నో వివాదాలు. బిగ్ బాస్ యాజమాన్యం తనను కమిట్ మెంట్ ఇవ్వాలంటూ వేధించారని యాంకర్ శ్వేతారెడ్డి ఆరోపిస్తుండగా… మరో నటి గాయత్రి సెక్స్ లేకుండా 100 రోజులు ఉండగలవా? అంటూ తనను బిగ్ బాస్ నిర్వాహకులు అభ్యంతరకరమైన ప్రశ్నలు వేశారంటూ ఆరోపించింది.

ఇలా ఎన్నో వివాదాల మధ్య బిగ్ బాస్ సీజన్ 3 ఈనెల 21న ప్రారంభం కానుంది. అయితే.. తాజాగా బిగ్ బాస్ షోపై యాంకర్ శ్వేతారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బిగ్ బాస్ 2 కోసం నన్ను మొదట ఎంపిక చేశారు. తర్వాత నన్ను కలవాలని శ్రీనగర్ కాలనీకి పిలిచి అసభ్యకరంగా మాట్లాడారు. అందుకే పోలీసులకు ఫిర్యాడు చేస్తున్నా. నాలాగా బాధపడిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ.. వాళ్లంతా ఇప్పటిదాకా భయపడ్డారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.. అంటూ శ్వేతా రెడ్డి వెల్లడించింది.

anchor swetha reddy complaint on bigg boss show

శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు.. బంజారాహిల్స్ పోలీసులు.. కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ నిర్వాహకులు నలుగురిపై ఆమె కేసు పెట్టారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశామని.. బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ కళింగరావు తెలిపారు.