ఇండియన్ మాజీ క్రికెటర్ తిరుపతి అంబటి రాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరారు.ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి ,మిథున్‌రెడ్డి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి,పాల్గొన్నారు. అంబటిని హత్తుకున్న జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన రాయుడు.. ‘రాజకీయాల్లో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించా. YCPలో చేరడం సంతోషంగా ఉంది. మొదటి నుంచి CMపై నాకు మంచి అభిప్రాయం ఉంది. కుల, మతాలతో పనిలేకుండా జగన్ రాజకీయాలు చేస్తున్నారు. జగన్ పాలన చాలా పారదర్శకం’ అని ప్రశంసలు కురిపించారు.
గుంటూరు నుండి అంబటి రాయుడు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన ఐపీఎల్ ట్రోఫీని చూపించినప్పుడు జగన్ను కలిశాడు. అతడు గుంటూరు జిల్లా పొన్నూరు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు. ఇటీవలే గుంటూరులోని పలు ప్రాంతాలలో రాయుడు పర్యటించారు.
2019లో ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు ఈ ఏడాది ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.