Andhra Pradesh :రేపు సీఎం జగన్ శ్రీసత్య సాయి జిల్లా పర్యటన

-

రేపు సీఎం వైఎస్‌ జగన్ శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, అనంతరం 12:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.15కు ముఖ్యమంత్రి జగన్‌ గోరంట్ల మండలం పాలసముద్రం చేరుకోనున్నారు. 3 గంటల 10 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ ఘన స్వాగతం పలకనున్నారు. ప్రధాని, గవర్నర్‌తో కలిసి ముఖ్యమంత్రి జగన్ నాసిన్ – నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. సాయంత్రం 7:30 గంటలకి తిరిగి తాడేపల్లికి సీఎం జగన్ చేరుకోనున్నారు.

ఇక్కడి కొనసాగుతున్న కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ డిటెక్షన్‌ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగించి మోడీ ఢిల్లీకి ప్రయాణమవుతారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి,రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news