జగన్ మోహన్ రెడ్డి కేబినేట్… సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో…. ఏకంగా 24 మంది అంటే మంత్రి వర్గంలో ఉన్న మంత్రలు అంతా రాజీనామాలు చేశారు. అంతకు ముందు పలు అంశాలకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ఇక ఏపీ కేబినేట్ సమావేశం అనంతరం.. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా.. కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలిపారు. నవ రత్నాలు పథకాల అమల్లో భాగంగా సున్నా వడ్డీ పథకం మూడో ఏడాది కూడా కొనసాగేంచేందుకు రూ.1259 కోట్లు చెల్లించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని స్పష్టం చేసారు.
ఏప్రిల్ 22 వ తేదీన సున్నా వడ్డీ పథకం నగదు విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీంతో లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరనుందని ఆయన ప్రకటన చేసారు. అలాగే.. తూ.గో జిల్లా కొత్తపేటలో 7 మండలాలతో.. కడప జిల్లా పులివెందులలో 8 మండలాలతో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.