మ‌ళ్లీ షాక్ ఇస్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు.. భారీగా ధ‌ర‌లు పెంపు

-

బంగారం, వెండి ధ‌ర‌లు సామాన్యు లకు మ‌రో సారి షాక్ ఇస్తున్నాయి. గ‌త మూడు రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు పెర‌గ‌కుండా.. నిల‌క‌డ‌గా ఉన్నాయి. కానీ నేడు బంగారం కొనుగోలు దారుల‌కు షాక్ ఇస్తూ.. భారీగా ధ‌ర‌లు పెరిగాయి. అలాగే వెండి ధ‌ర‌లు కూడా గ‌త రెండు రోజుల నుంచి త‌గ్గుతూ వ‌చ్చాయి. కానీ మ‌రో సారి అందరికీ షాక్ ఇస్తూ భారీగా పెరిగాయి. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ వ్యాప్తి, ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధం కార‌ణంగా బంగారం, వెండి ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి.

వీటి ప్ర‌భావం కొంత వ‌ర‌కు త‌గ్గుతున్నాయని అనుకునే లోపే మ‌రోసారి ధ‌రల పెంపు సామాన్యుల‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ రోజు 10 గ్రాముల బంగారంపై రూ. 200 నుంచి రూ. 230 వ‌ర‌కు పెరిగాయి. అలాగే కిలో గ్రాము వెండిపై రూ. 300 వ‌ర‌కు పెరిగింది. ఈ రోజు పెరిగిన ధ‌ర‌ల‌తో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ‌, తెలంగాణ లోని హైద‌రాబాద్ న‌గ‌రాల్లో 10 గ్రాముల బంగారం.. 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 48,000 కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 52,370 కి చేరింది. దీంతో పాటు కిలో గ్రాము వెండి ధర రూ. 71,000 అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news