ఏపీలో పెరిగిన కరోనా.. కొత్తగా 1178 కేసులు

-

చైనా లో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ఏపీని వదలేలా లేదు. ఆంధ్ర ప్రదేశ్‌ లో మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు.. ఇప్పుడు పెరిగి పోతున్నాయి. తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,20,347 కి పెరిగింది.

ap carona
ap carona

ఒక్క రోజు వ్యవధిలో మరో 10 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,935 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,452 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1266 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 54, 970 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,70 , 37, 651 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,91,960 లక్షలకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news