Mobile business ideas: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనిచ్చే వ్యాపారాలు..!

-

మీరు మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియాస్ business ideas ని ఫాలో అవ్వండి. ఇవి నిజంగా చాలా పాపులర్ మొబైల్ బిజినెస్ ఐడియాస్. పైగా ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తారు కూడా. అయితే మరి ఇక ఈ బిజినెస్ ఐడియాస్ గురించి చూస్తే…

ఫుడ్ ట్రక్ :

ఫుడ్ ట్రక్ ని మీరు మొదలు పెడితే మంచిగా లాభాలు పొందొచ్చు. పైగా తక్కువ ఖర్చుతో మీరు దీనిని మొదలు పెట్టొచ్చు.

మొబైల్ సెలూన్:

మొబైల్ సెలూన్ ని కూడా తక్కువ పెట్టుబడి తో మొదలు పెట్టొచ్చు. ఈ బిజినెస్ కూడా బాగుంటుంది. అదిరే లాభాలు పొందడానికి ఇది కూడా మంచి బిజినెస్ అని చెప్పొచ్చు. మంచిగా వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ని మీరు చేశారు అంటే కచ్చితంగా బాగా బిజినెస్ రన్ అవుతుంది. ఒక పెద్ద హోటల్ ముందు కానీ ఎక్కువ మంది వచ్చే స్ట్రీట్ లో కానీ పెట్టుకుంటే చక్కటి రాబడి పొందొచ్చు. లేదా అపార్ట్మెంట్ కాంప్లెక్స్, పెళ్లిళ్లు జరిగే చోట కూడా మీరు ఈ మొబైల్ సెలూన్ మొదలు పెట్టొచ్చు.

పెట్ గ్రూమింగ్:

ఈ మధ్య కాలంలో చాలా మంది పెంపుడు జంతువుల్ని పెంచుతున్నారు. వాటికి ఉపయోగపడేలా మీరు కొన్ని రకాల సర్వీసులను ఇచ్చారంటే మంచి లాభాలను పొందటానికి వీలవుతుంది ఇది కూడా మీకు బాగుంటుంది.

పువ్వులు అమ్మడం:

ఒక ఫ్లవర్ ట్రక్ ని ఏర్పాటు చేసి పూలని అమ్మితే కూడా మంచి రాబడి పొందొచ్చు. మీరు కాస్త విభిన్న రకాల పూలను తెచ్చి సేల్ చేస్తే ఎంతో ఆకర్షణీయమైన రాబడి పొందొచ్చు.

కాఫీ లేదా టీ షాప్:

మీరు ఒక మొబైల్ వ్యాన్ లో కాఫీ లేదా టీ వంటి వాటిని తయారు చేసి కూడా అమ్మచ్చు. పార్ట్ టైం కింద కూడా మీరు ఈ పని చేయొచ్చు. పైగా కాఫీ ప్రియులు చాలామంది వుంటారు కాబట్టి ఏమి బిజినెస్ బాగా లాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news