ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం చాలా రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా రేపటి నుంచి అనగా ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. కొంత మంది అభ్యర్థులు బీ ఫామ్ లను పొందగా.. మరికొందరూ పొందాల్సి ఉంది. ఇప్పటికే జనసేన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీ ఫామ్ లను అందజేశారు. మరోవైపు వైసీపీ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సీఎం జగన్ తరపున ఈనెల 22న ఒక సెట్ నామినేషన్ ను ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేయనున్నారు. అలాగే ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 19న కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు మంగళగిరి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే ఈనెల 19న రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు.