ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని విడగొడతామని ఢిల్లీలో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవీ పొందారు. అప్పట్లో హైదరాబాద్ ఆఫీస్ ఓపెన్ చేసి సీఎం హోదాలో కమీషన్లు వసూలు చేశారు. ఇప్పుడు మనకు రాజధాని లేకుండా పోవడానికి కిరణ్ కుమార్ రెడ్డినే కారణం అన్నారు.
అలాంటి వ్యక్తి వచ్చి ఇవాళ రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే మా పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలపై విమర్శలు చేశారు మంత్రి పెద్ది రెడ్డి. ఓటమి భయంతోనే కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.