రైల్వేలకు భూములు ఎప్పుడో స్వాధీన పరిచామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని అప్పగించింది. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు భూములు ఇవ్వలేదనడం హాస్య స్పదంగా ఉందన్నారు. పీయూష్ గోయల్ అబద్దాలు చెబుతున్నారు. రైల్వే కు భూముఇవ్వలేదనడం ఇది అన్యాయమన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ అధికారంలోకి వస్తారని.. కూటమికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. ముఖ్యంగా కేంద్రంలో వైసీపీ పై ఆధారపడే పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అలా వస్తే.. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం మాట్లాడవచ్చని, అది తమ స్వార్థమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పనులు అడిగితే పూర్తి అయ్యే పరిస్థితి లేదని, కేంద్రం అన్ని రాజకీయ కోణంలోనే ఆలోచిస్తుందని తెలిపారు.