ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హడావిడి చాలా రసవత్తరంగా మారింది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నిత్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీ మంత్రి వేణు గోపాల కృష్ణ మీడియాతో మాట్లాడారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారని లేఖ రాశావు మరిచిపోయావా..? చంద్రబాబు అని ప్రశ్నించారు మంత్రి వేణు. చంద్రబాబు ప్రలోభాలు పెట్టి బీసీలను లొంగదీసుకోవాలనుకున్నావు.
పూలే జయంతి నాడు కులగణను ప్రకటించామని గుర్తు చేశారు. దానిని సజావుగా పూర్తి చేస్తామన్నారు. కులగణన వివరాలను ప్రజలకు పంపిస్తామని తెలిపారు. కమీషన్లకు కక్కుర్తిపడి గతంలో నాణ్యత లోపం ఉన్న పనిముట్లను సరఫరా చేశావు. సామాజిక సాధికారతకు నిలువెత్తు దర్పణం సీఎం జగన్ అన్నారు. కులగణణకు బీజేపీ అనుకూలమా..? వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి వేణు గోపాల కృష్ణ.