ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి రాళ్లతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనపై తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సజ్జల డైరెక్షన్ లో సీఎం జగన్ నటిస్తున్నారు. గత ఎన్నికల్లో గొడ్డలి పోటుతో సానుభూతి పెంచుకున్నారు.
ఈ సారి గులకరాయి డ్రామా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎవరైనా బలికావొచ్చు. ముందు జాగ్రత్తతోనే విజయమ్మ అమెరికా వెళ్లారు అని ప్రజలు అనుకుంటున్నారు అని వివరించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా జైలు నుంచి బయటకు రానంటున్నారు అని వ్యంగ్యంగా అన్నారు. ఎవరు పోతే సానుభూతి వస్తుందని అనుకుంటారో వారు ఎగిరిపోతారని, వీళ్ల రాజకీయ దాహం కోసం సొంత బాబాయే ఎగిరిపోయారని చింతమనేని వ్యాఖ్యానించారు. జగన్ పై రాయి దాడి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.