ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.. తెలుగుదేశం పార్టీ జనసేన లో ఉన్న అసంతృప్త నేతలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.. సీఎం జగన్ రాజకీయ చతురతతో ప్రతిపక్ష నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు రాష్ట్రంలోని యువత సీనియర్ నేతలు ముందుకొస్తున్నారు.. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన టిడిపి జనసేనకు చెందిన కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు జగన్ సమక్షంలో ఫ్యాను కండువా కప్పుకుంటున్నారు..
ఎన్నికలకి రెండు నెలల ముందు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి జంపింగ్ లు మనం చూస్తుంటాం.. కానీ ఆంధ్రప్రదేశ్లో సీన్ రివర్స్ అవుతుంది.. టిడిపి జనసేన లో టిక్కెట్లు రాని నేతలందరూ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరుతున్నారు.. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ గోరుముచ్చు గోపాల్ యాదవ్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
రాజంపేట టిడిపి లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి గంట నరహరి, నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఆయన కుమారుడు చిన్నము చైతన్య, పాయకరావుపేటకు చెందిన మాజీ ఎమ్మెల్సీ జనసేన నాయకురాలు అంగూరి లక్ష్మీ శివకుమారి, అలాగే జై భారత్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కొరకపూడి చిన్నయ్య దొర వైసీపీకి జై కొట్టారు.. విజయవాడ విశాఖపట్నం చెందిన పలువురు కీలక బీసీ నేతలు ఎస్సీ నేతలు జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీలో చేరారు.. ఆయా కార్యక్రమాలలో రేషనల్ కోఆర్డినేటర్లు, ఇన్చార్జిలు హాజరై .. పార్టీలో చేరిన నేతలకు సీఎం జగన్ ద్వారా రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇప్పించారు..
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభంజనం ఖాయం అంటూ ఇప్పటికే పలు సర్వేలు ఘంటాపదంగా చెబుతున్నాయి.. దీంతో టిడిపి , జనసేనలో ఉండే కీలకనేతలు వైసీపీలో చేరుతున్నారని, మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు..