వాట్సాప్ లో కొత్త ఫీచర్లు..!

-

ప్రస్తుత రోజులలో యువత స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేకపోతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వీటి వాడుకము విపరీతంగా పెరిగిపోయింది.గతంలో కాల్స్, మెసేజ్‌ల వరకూ ఫోన్లు పరిమితమై ఉండేది .కానీ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారడంతో అన్ని అవసరాలకు స్మార్ట్ ఫోన్స్ ప్రత్యామ్నాయంగా మారాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్స్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది.

ఇక తాజాగా వాట్స్అప్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఏఐ ఆధారిత ఇమేజ్ టూల్ అందుబాటులోకి రానుంది అని తెలుస్తోంది.. దీని సాయంతో ఫొటోలను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు, స్టైల్, బ్యాక్ గ్రౌండ్ మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. అలాగే ‘ఆస్క్ మెటా’ అనే మరో ఫీచర్నూ వాట్సాప్ తీసుకురానుంది. యాప్లో సెర్చ్ బార్ ద్వారా మెటా ఏఐని ప్రశ్నలు అడిగి, అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఈ రెండు ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news