సీఎం హోదాలో తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే : చంద్రబాబు

-

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెడుతానని ఆయన హామీ ఇచ్చారు. 9 సంవత్సరాల ఐదు నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసే రికార్డు నెలకొల్పానన్నారు. మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటైతే తప్ప తన రికార్డును బ్రేక్ చేయలేరన్నారు. రెండు రాష్ట్రాలు కలవవు.

తన రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతగా కూడా తన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు. ఎస్సీలకు న్యాయం చేసేందుకు ఏ,బీ,సీ,డీ వర్గీకరణను టీడీపీ తీసుకొచ్చిందన్నారు. ఏ,బీ,సీ,డీ వర్గీకరణను వైయస్ రాజశేఖర్ రెడ్డి కాపాడ లేకపోయాడన్నారు. దళితులకు ద్రోహం చేసింది… గొంతు కోసింది జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ బటన్ నొక్కింది ఎంత.. బొక్కింది ఎంత అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అని అందరి చెవిలో సీఎం జగన్ పూలు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు ఆకర్షించడం మన బ్రాండ్.. పెట్టుబడులు తరిమేయడం జగన్ బ్రాండ్ అంటూ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news