తమ హయాంలో అక్కాచెల్లెమ్మలకు నేరుగా రూ.2.70 లక్షల కోట్ల అందించామని సీఎం జగన్ తెలిపారు. ఇవాళ రాజంపేట సభలో మాట్లాడుతూ.. మహిా సాధికారితకు అర్థం చెబుతూ వారికి తోడుగా ఉన్నామన్నారు. ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అందించామని తెలిపారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. మహిళల కోసం గతంలో ఇంతలా ఎవరైనా పని చేశారా..? అనేది ఆలోచించాలని ప్రజలను కోరారు.
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చామని సీఎం జగన్ గుర్తు చేశారు. పేదవాడి వైద్యం కోసం ఆరోగ్య శ్రీని రూ.25లక్షల వరకు విస్తరించామని తెలిపారు. పేషెంట్ విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరాతో ఆదుకున్నాం. గ్రామాల్లోనే ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశామని తెలిపారు. పేదల ఆరోగ్యం కోసం ఇంతలా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదని పేర్కొన్నారు.