పవన్ కళ్యాణ్ కి అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని వైసీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. 2014 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేశారు అని ప్రశ్నించారు. అందులో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి..? ఎన్ని సినిమాలు డిజాస్టర్లు అయ్యాయని అడిగారు. కనీసం 6 సినిమాలు కూడా చేయలేదు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు..? ఎంత ట్యాక్స్ కట్టారు..? పార్టీ కోసం ఖర్చు పెట్టింది ఎంత..? కొన్న ఆస్తుల యొక్క విలువ ఎంత..? అని ప్రశ్నించారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఆస్తులకి సంబంధించిన వివరాలను బయటపెడతానని స్పష్టం చేశారు పోతిన మహేష్.