ఏడాది ఏడాదికి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఎండలు దంచికొడుతుండడంతో స్కూళ్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్స్ మోగించాలని విద్యాశాఖ కీలక నిర్ణయించింది
అన్ని ప్రభుత్వ స్కూళ్లలో క్రమం తప్పకుండా వాటర్ బెల్ కార్యక్రమం కొనసాగించాలని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ స్పష్టం చేసింది. ‘విద్యార్థుల్లో డీహైడ్రేషన్ నివారణకు రోజుకు 3సార్లు వాటర్ బెల్ నిర్వహించాలి అని ఈ మేరకు తెలిపారు. ఏప్రిల్ 23 వరకు ప్రతిరోజూ DEOలు దీన్ని పర్యవేక్షించాలి. మూత్రం రంగును బట్టి శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు గుర్తించేలా అవగాహన కల్పించాలి.మార్నింగ్ 9.45, 10.05, 11.50 గంటలకు బెల్ మోగించాలి’ అని పేర్కొంది.