Andhra Pradesh: పిన్నెల్లికి హైకోర్టు కీలక ఆదేశాలు

-

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన కోసం పోలీసులు గాలిస్తుండగానే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా..హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో జూన్ 5వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు రోజు మాచర్లకు వెళ్లవద్దని సూచించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు అనుమతి కల్పించింది. కాగా.. ఈ కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే.

కాగా, ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులు బీభత్సమే సృష్టించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం మిషన్ ను ధ్వంసం చేశారు. పోలింగ్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు.దీంతో సీఈవో ముఖేష్ కుమార్ మీనా పిన్నెల్లిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని.. ఆయన కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారని తెలిపిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news