T20 ప్రపంచకప్ కామెంటేటర్ల లిస్ట్ రిలీజ్

-

జూన్ 1 నుంచి జరగనున్న T20 వరల్డ్ కప్ 2024 కోసం ఐసీసీ ఈరోజు కామెంటేటర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 40 మంది కామెంటేటర్లు T20 మెగా టోర్నీకు ఎంపికయ్యారు.ఈ లిస్టులో రవిశాస్త్రి,ఇయాన్ స్మిత్, నాజర్ హుస్సేన్,హర్షా భోగ్లే, మెల్ జోన్స్, ఇయాన్ బిషప్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఇండియా నుంచి సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దినేష్ కార్తీక్ లకు కామెంటేటర్ బాధ్యతలు స్వీకరించడానికి రెడీగా ఉన్నారు.

అమెరికన్ వ్యాఖ్యాత జేమ్స్ ఓ’బ్రియన్ కామెంటేటర్ గా అరంగేట్రం చేయనున్నాడు. వన్డే ప్రపంచ కప్ విజేతలు రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్,సునీల్ గవాస్కర్, రమీజ్ రాజా,టామ్ మూడీ, ఇయాన్ మోర్గాన్, వసీం అక్రమ్ ఈ టోర్నీలో వ్యాఖ్యాతలుగా అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రేమ్ స్మిత్, మైఖేల్ అథర్టన్,డేల్ స్టెయిన్, వకార్ యూనిస్, షాన్ పొలాక్,సైమన్ డౌల్ లాంటి దిగ్గజాలు కామెంట్రీ బాక్స్ లో సందడి చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news