ఏపీలో తెలుగుదేశం పార్టీ , జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ప్రస్తుతం ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా ఆయా నేతలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఎవరికి ఆ పదువులు దక్కుతాయోనని ఉత్కంఠ నెలకొంది.
అయితే, పొత్తు ధర్మాన్ని పాటించి టీడీపీ, జనసేన చెరో రెండు స్థానాలు తీసుకుంటాయా లేక ఆ రెండింటిని చంద్రబాబే తీసుకుంటారా అని ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలోనే పిఠాపురం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసి పవన్‌ను గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేసిన వర్మకు, అదేవిధంగా మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ కోసం సీటును వదులుకున్న దేవినేని ఉమకు ఇస్తారని తెలుగుదేశం పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.