AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా అడవులపై ఫోకస్ పెట్టారు. అడవుల్లో పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చెయ్యాలను అధికారులను ఆదేశించారు. టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి అని తెలిపారు. పులుల వేట.. స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తాం.. ఇందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు అని పేర్కొన్నారు. పులులను కాపాడితే.. అవే అడవులను రక్షిస్తాయి. పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యంగా ఉంటుంది అని అన్నారు.
అయితే మన్ కీ బాత్’లో నల్లమలలో టైగర్ ట్రాకర్స్ గా చెంచుల గురించి ప్రధాని మోడీ ప్రస్తావించడం సంతోషకరం అని.. వసుధైక కుటుంబంలో వన్య ప్రాణులు కూడా భాగమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. అదే విధంగా అటవీ శాఖలో ఉన్న ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతాం అని.. అధికారులు సంరక్షణ ప్రణాళికలపై దృష్టి సారించాలని పవర్ణ్ కళ్యాణ్ కోరారు.