ఆ అనాథ బాలికకు రూ.10లక్షల సాయం : సీఎం చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలిపోయిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట మట్టి మిద్దె కూలడంతో ఒకే ఇంట్లో నలుగురు మరణించారు. ఈ ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విషాదంలోకి నెట్టేసింది. గురుశేఖర్ రెడ్డి (45), దస్తగిరమ్మ(38) దంపతులు వారిద్దరూ కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మీ (10) లుగా గుర్తించారు.

తాజాగా ఈ ప్రమాదం పై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. నంద్యాల జిల్లా చాగల మర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందిన ఘ‌ట‌న‌పై చలించిపోయారు సీఎం చంద్రబాబు. తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మిగిలిన బాలికకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  బాలిక సంర‌క్షణ బాధ్యత తీసుకుంటామ‌ని ప్రకటించిన సీఎం చంద్రబాబు. బాలిక నాన్నమ్మకు రూ.2 లక్షల సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news