వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వంలో దాడులు ఎక్కువయ్యాయని.. వైసీపీ జెండా మోసిన వారిని టార్గెట్ చేశారని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలతో జైళ్లను నింపే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. చంద్రబాబు సమావేశాల్లో అమరావతి, అభివృద్ధి, సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారని.. కానీ తెర వెనుక జరిగేదంతా మట్టి, ఇసుక దోపిడీ, లే అవుట్ల పేరుతో దోపిడీనే అని ధ్వజమెత్తారు పేర్ని నాని.
2023 ఫిబ్రవరిలో వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు.. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు తిరగబడితే ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు పేర్ని నాని. గన్నవరం వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నవారిని అరెస్టు చేస్తున్నారు. పోలీసులను అడ్డగోలుగా దిగజార్చి వాడుకుంటున్నారు. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారని ఆరోపించారు. వైసీపీ మండల అధ్యక్షుడి తల్లి చనిపోతే దినం చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పేర్నినాని తో పాటు, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం పరామర్శించారు.