అమెరికాలో రెండు వేదికలలో రెండు రోజుల క్రితం ప్రారంభమైన మేజర్ లీగ్ క్రికెట్ లో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో సంచలనం నమోదు అయింది. ముంబై ఇండియన్స్ న్యూ యార్క్ మరియు లాస్స్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. బదులుగా ఛేదనను ప్రారంభించిన సునీల్ నరైన్ సేన టార్గెట్ అంచుల వరకు కూడా వెళ్లలేకపోయింది. పేపర్ మీద చూసుకుంటే బలమైన జట్టుగా ఉన్న లాస్స్ ఏంజెల్స్ గ్రౌండ్ లో మాత్రం పూర్తిగా తేలిపోతోంది. ప్రపంచ స్థాయిలో మ్యాచ్ విన్నర్లుగా పేరున్న నరైన్, రస్సెల్ , గుప్తిల్, రసౌ లు ఉన్నా కనీసం 100 పరుగులు కూడా చేయలేక కేవలం 50 పరుగులకే అల్ అవుట్ అయింది. ముంబై బౌలర్లలో బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరూ రెండు వికెట్లు తీసుకుని జట్టుకు సమిష్టిగా విజయాన్ని అందించారు.
దీనితో ముంబై ఇండియన్స్ జట్టు పరుగుల తేడాతో విజయాన్ని సాధించి టోర్నీ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన టీం డేవిడ్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.