అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 19న జరిగిన వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఆతిధ్య ఇండియాను ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఆరవసారి టైటిల్ ను గెలుచుకున్న జట్టుగా అవతరించింది. టైటిల్ గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ప్రవర్తించిన తీరు పట్ల కోట్లాదిమంది ఇండియా అభిమానులు చాలా బాధపడ్డారు. మిచెల్ మార్ష్ గెలిచిన వరల్డ్ కప్ ట్రోఫీ పై కాళ్ళు పెట్టుకుని ఫోటో దిగడంతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంపై ఆవేదన చెందిన ఇండియాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పండిట్ కేశవ్ ఈ ఫిర్యాదులో చాలా స్పష్టంగా భారత్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసాడంటూ పేర్కొనడం జరిగింది.
ఇక ఇదే కంప్లైంట్ కాపీ ని ప్రధాని నరేంద్ర మోదీకి సైతం పంపించి ఇకపై మార్ష్ ఇండియా లో ఆడకుండా నిషేధం విధించాలన్నారు. ఇక వెంటనే అలీఘడ్ పోలీసులు ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ పై FIR ను నమోదు చేశారు.