18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇస్తే.. ఇక కఠిన చర్యలే..!

-

If vehicles are given to children under 18 years of age, strict action will be taken.

Community-verified icon

కారు నడపడం వల్ల ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మిగితా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బాలుడితో పాటు కారు యజమాని అయిన తండ్రిపై కఠిన సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తెలంగాణ పోలీస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. 18 ఏళ్లలోపు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.

ముఖ్యంగా మైనర్లకు అలా  వాహనాలు ఇస్తే యజమానిపై కూడా అత్యంత కఠినమైన కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా మీ జీవితాలే కాదు ఎదుటి వారి కుటుంబాలు సైతం అంధకారంలోకి వెళ్తాయని పేర్కొంది. పిల్లలను గమనిస్తూ, అపరిపక్వ పనులు చేయకుండా చూడడం తల్లిదండ్రుల బాధ్యత అని ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news