ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

-

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులపై కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్ సౌకర్యం వల్ల అటు ఆర్టీసీకి, ఇటు ఆటోలకు తీవ్ర నఫ్టం చేస్తున్నారు.

తాజాగా  ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య  చేసుకున్నాడు.  నవీపేట మండలంలోని అబ్బాపూర్ తండాకు చెందిన నేనావత్ వినోద్(27) అనే ఆటోడ్రైవర్ ఫైనాన్స్ ద్వారా ఆటోను కొనుగోలు చేశాడు. ఫైనాన్స్ చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన ఫైనాన్స్ వారు ఆటోను తీసుకెళ్లారు. దీంతో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడి.. పురుగుల మందును సేవించి చికిత్సపొందుతూ మృతి చెందాడు

Read more RELATED
Recommended to you

Latest news