TTD : తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ పాలక మండలి ప్రకటించింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామి వారిని 72,263 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ. 3.65 కోట్లు చేకూరింది.
తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెల అర్జిత సేవా టికెట్లు నేడు ఉదయం పదిగంటల నుంచి 20న ఉదయం 10 వరకు అందుబాటులో ఉండనున్నాయి. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన వారు 22న మధ్యాహ్నం 12 లోగా రుసుము చెల్లించాలి. 22న ఉదయం 10కి కల్యాణోత్సవం, అర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవా టికెట్లు, మధ్యాహ్నం 3కి వర్చువల్ సేవా టికెట్లు, 24న ఉదయం 10కి ఏప్రిల్ నెల రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. పూర్తి వివరాలు, టికెట్ల కోసం టీటీడీ వెబ్ సైట్ లో చూడండి.