ఇన్నర్ స్కాములో పవన్ కళ్యాణ్ కి 2.7 ఎకరాలు ?

-

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు ఊహించని షాక్‌ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు. విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వనున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్న విషయం తెలిసిందే.

ఇలాంటి తరుణంలోనే… అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇదే ఇన్నర్ రింగ్ రోడ్ కి కాస్త దూరంలో కాజాలో పవన్ కళ్యాణ్ సుమారు రెండున్నర ఎకరాలు (368/B1) ఎన్ఆర్ఐ ప్రసాద్ దగ్గర్నుంచి (లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్) కొనుగోలు చేసారని సమాచారం అందుతోంది.

ఇప్పుడు దీన్ని సాకుగా చూపిస్తూ బులుగు పచ్చ మీడియా ఆయనకి అవినీతి మరక వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్‌ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కాకపోతే ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటంటే, పవన్ కొన్న భూమి (368/B1) వాళ్లకు లాగా బినామీల పేరుతో కొనలేదు ఆయన పేరు మీదే 41 లక్షలు ఇచ్చి ఔట్ రైట్ గా కొన్నాడట. ఆరోజు అక్కడ రియల్ ఎస్టేట్ వారి ప్రకారం దాని విలువ సుమారు ఎకరం 34 లక్షలు ఉందని సమాచారం. ఇదంతా చూసుకుంటే పవన్ ప్రభుత్వ ధర కన్నా ఎక్కువ ఇచ్చే కొన్నాడని టాక్‌. దీనిపై లీగల్ గా సుప్రీం కోర్టుకి వెళ్లినా పవన్ కి చిన్న మరక కూడా అంటకుండా భయటకి వస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news