అనకాపల్లిలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి

-

ఏపీలోని అనకాపల్లిలో రాఖీ పౌర్ణమి పండుగ పూట విషాదం నెలకొంది. మూడు కుటుంబాల్లో ఈ పండుగ విషాదం నింపింది. కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..?

రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో సమోసా తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం రోజున ముగ్గురు దుర్మరణం చెందారు. మృతి చెందిన విద్యార్థులను జాషువా, భవాని, శ్రద్ధగా గుర్తించారు. మిగతా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 17 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటనపై డీఈవో అప్పారావు విచారణ చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news