రుషికొండపై జగన్‌ క్యాంపు నిర్మాణానికి రూ. 443 కోట్లు ఖర్చు !

-

 

రుషికొండపై ముఖ్యమంత్రి గారి నివాస, క్యాంపు కార్యాలయ సముదాయ నిర్మాణానికి 443 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. జీవోలన్నింటిని బహిర్గతం చేయాలని ఇటీవల న్యాయస్థానం ఆదేశించిందని, దీనితో రుషికొండపై ముఖ్యమంత్రి గారి నివాస, కార్యాలయ సముదాయ నిర్మాణం కోసం ఇచ్చిన జీవోలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. 100 కోట్ల రూపాయలు దాటితే న్యాయ సమీక్ష అవసరమని భావించి, నాలుగు ముక్కలుగా టూరిజం ప్రాజెక్టు పేరిట రుషికొండపై విలాసవంతమైన భవన సముదాయ నిర్మాణాన్ని చేపట్టారని వెల్లడించారు.

ఈ కాంట్రాక్టర్లకు అరువు పెట్టకుండా అప్పుడే బిల్లులన్నీ చెల్లించారని తెలిపారు. ఒక వ్యక్తి తన విలాసం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి, పర్యావరణ చట్టాన్ని పూర్తిగా తుంగలోతోక్కి కట్టకూడని ప్రాంతంలో భవన నిర్మాణాన్ని చేపట్టడం దారుణం అన్నారు. టూరిజం భవనం అని చెప్పి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని, కోర్టుకు పచ్చి అబద్దాలను చెప్పి బ్లాకులు, బ్లాకులుగా ముఖ్యమంత్రి గారికి అవసరమైన విధంగా భవన సముదాయాన్ని నిర్మించారని, చట్టాలను నిర్లజ్జగా ఉల్లంఘించి ఒక వ్యక్తి కోసం 433 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం నిర్మించడం ఎంత వరకు సమంజసమని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news