పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. చింతకుంట విజయ రమణారావు ఆస్తులు, పాన్ కార్డులు, అప్పుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఫైర్ అయ్యారు.
కేంద్ర ఎన్నికల సంఘం,ఈడీ, ఆదాయపన్ను శాఖ,హోమ్ శాఖ,ఆర్ధిక శాఖకు ఫిర్యాదు చేశానని..విజయ రమణారావు తప్పులు తేలితే… ఆరేళ్ళు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.
హైదరాబాద్ లో ఆదాయపన్నుఅధికారులకు ఫిర్యాదు చేస్తానని..విజయ రమణ రావుకి ఓటు వేస్తే పెద్దపల్లి ప్రజలు ఓటు వృధా అవుతుందని స్పష్టం చేశారు.
30 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉండి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నందుకు,చట్ట విరుద్ధంగా వ్యవహరించినందుకు జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉందన్నారు. విజయ రమణా రావుకి వ్యతిరేకంగా ఫేక్ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసే అవసరం నాకు లేదని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే గొనే ప్రకాష్.