చిత్తూరు రోడ్డు ప్రమాదం.. బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం..!

-

చిత్తూరు జిల్లాలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మితి మీరిన వేగంతో ఓ లారీ పక్క రోడ్డులో వస్తున్న బస్సును ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటుగా మొత్తం 8 మంది మరణించారు. ఇక తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు ఆయన.

చిత్తూరు జిల్లా మొగ‌లి ఘాట్ వ‌ద్ద జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో 8 గురు మృతి చెంద‌డం పై సీఎం చంద్ర‌బాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు అని ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వం తరపు నుండి మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు ఒక లక్ష రూపాయలు సహాయం ఇవ్వనున్నారు. అయితే ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 31 మంది గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయాలు అందిస్తున్నాం అని పేర్కొన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version