‘సైమా’ 2024 అవార్డుల విజేతలు వీరే..!

-

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024 వేడుక దుబాయ్ వేదికగా జరిగింది. సెప్టెంబర్ 14, 15 తేదీలలో నిర్వహిస్తున్న ఈ వేడుక సౌత్ ఇండియాకు సంబంధించిన నటీ, నటులు హాజరై సందడి చేశారు. మొదటి రోజు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు సంబంధించి 2023లో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులు, చిత్ర బృందాలకు అవార్డులను అందించారు. ముఖ్యంగా హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, శ్రేయ, నేహాశెట్టి, శాన్వీ వంటి వారు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 

2024 సంవత్సరానికి దసరా మూవీలో నాని నటనకు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఉత్తమ నటీగా కీర్తి సురేష్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ సినిమాగా బాలకృష్ణ-అనీల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరి నిలిచింది. కన్నడలో సప్తసాగర దాచె ఎల్లో-ఏ నటనకు ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టి, నటీగా రుక్మిణి వసంత్ అవార్డులు అందుకున్నారు. 

సైమా 2024 అవార్డుల విజేతలు వీరే : 

  • ఉత్తమ నటుడు- నాని (దసరా)
  • ఉత్తమ నటి- కీర్తి సురేష్ (దసరా)
  • ఉత్తమ దర్శకుడు- శ్రీకాంత్ ఓదెల (దసరా)
  • ఉత్తమ చిత్రం- భగవంత్ కేసరి
  • ఉత్తమ సహాయక నటుడు- దీక్షీత్ శెట్టి (దసరా)
  • ఉత్తమ సహాయ నటి – బేబీ ఖియారా ఖాన్ (హాయ్ నాన్న)
  • ఉత్తమ హాస్య నటుడు- విష్ణు (మ్యాడ్)
  • ఉత్తమ పరిచయ నటి- వైష్ణవి చైతన్య (బేబీ)
  • ఉత్తమ సంగీత దర్శకుడు- అబ్దుల్ వాహబ్ (హాయ్ నాన్న, ఖుషి)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ- భువనగౌడ (సలార్ )
  • ఉత్తమ నేపథ్య గాయకుడు- రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం)
  • ఉత్తమ పరిచయ నటుడు- సంగీత్ శోభన్ (మ్యాడ్)
  • ఉత్తమ పరిచయ దర్శకుడు- శౌర్యువ్ (హాయ్ నాన్న)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – ఆనంద్ దేవరకొండ (బేబీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్) – మృణాల్ ఠాకూర్ 
  • ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – సాయి రాజేష్

 

Read more RELATED
Recommended to you

Exit mobile version