తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల నడకమార్గంలో చిరుత సంచారాన్ని గుర్తించేందుకు ఏకంగా 500 ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు టిటిడి వెల్లడించింది. నడక మార్గానికి చేరుకున్న నిపుణుల బృందం… చిరుత కదలికలు గుర్తించి ఆ ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేయనున్నారు అధికారులు.
కాగా, కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 15 గంటల సమయం పడుతుంది. తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక నిన్న 78,726 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ పాలకమండలి ప్రకటన చేసింది. అలాగే 26,436 మంది తల నీలాల్ సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. అటు నిన్న తిరుమల వెంకటేశ్వరుని హుండీకి 3.94 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ స్పష్టం చేసింది.