ఏపీకి కేంద్రం శుభవార్త..అమరావతి స్మార్ట్‌ సిటీకి రూ.930 కోట్లు

-

ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. అమరావతి స్మార్ట్‌ సిటీకి రూ.930 కోట్లు విడుదల చేసింది. స్మార్ట్ సిటీల కింద ఎంపికైన అమరావతిలో రూ. 930 కోట్ల విలువైన 19 ప్రాజెక్టులు, విశాఖ స్మార్ట్ సిటీ కింద రూ. 942 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. టిడిపి ఎంపీ కనకమెడల, భాజాపా ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

అమరావతిలో రూ. 627.15 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని, విశాఖలో ఇప్పటివరకు రూ. 452.25 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇది ఇలా ఉండగా, YSR వాహన మిత్ర పథకంలో భాగంగా ఈ నెల 31న ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ. 10,000 చొప్పున జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా దరఖాస్తుకు ఈ రోజుతో గడువు ముగియగా, ఎల్లుండి వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈసారి కొత్తగా రేషన్ సరాఫరా చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేట్లకు కూడా నగదు చెల్లించనుంది. గతేడాది 2.61 లక్షల మందికి లబ్ధి చేకూరగా, ఈసారి సంఖ్య భారీగా పెరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news