కూతురు ఎంగేజ్మెంట్ అయిన నేపథ్యంలో..భార్యను చంపాడు ఓ భర్త. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… భార్యను నరికి హత్య చేశాడు భర్త. తుగ్గలి మండలం రాంపురంలో భార్యను గొడ్డలితో నరికాడు భర్త వెంకటేష్.
దీంతో అక్కడికక్కడే భార్య పద్మావతి మృతి చెందింది.కూతురికి వివాహం నిశ్చయం చేసినా.. భార్య తన అన్న కుమారునితో పంపిందనే అనుమానంతో భార్యను గొడ్డలితో నరికాడు భర్త వెంకటేష్. రాత్రి పడుకొని ఉండగా భార్యను గొడ్డలితో నరికాడు భర్త వెంకటేష్. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.