హుండీలో రూ.100 కోట్ల చెక్ వేసిన భక్తుడు.. ఖాతాలో డబ్బులు చూసి షాక్..!

-

దేవుడి గుడిలో అడుగుపెట్టగానే భక్తులు భక్తిలో మునిగిపోతారు. దేవుడిపై అపార నమ్మకంతో హుండీలో అందుకు అనుగుణంగా కానుకలు వేస్తుంటారు. దేవుడికి చెల్లించడానికి ఉబలాపడతారు. ఓ వ్యక్తి మాత్రం కొంత తెలివిగా నడుచుకున్నట్టు అర్థం అవుతున్నది. బంగారం వేసి దానిని కోల్పోవడం ఎందుకు అని కొత్తగా ఆలోచించాడో ఏమో.. ఖాతాలో రూ.100 కోట్లు రాసి ఓ చెక్ హుండీలో వేశాడు. ఏమవుద్దీ.. ఏమైనా తన ఖాతాలోనే డబ్బు లేదు. అంతకు మించి ఆ దేవుడు ఏమైనా బ్యాంకుల చుట్టూ తిరుగుతాడా ? అని అనుకున్నాడో ఏమో కానీ.. ఆ చెక్ చూసిన ఆలయ సిబ్బంది మాత్రం ఖంగు తిన్నారు.

ఈ ఘటన సింహాచలం వరాహలక్ష్మీ నరసింహా స్వామి హుండీని సిబ్బంది పక్షం రోజులకు ఒకసారి లెక్కిస్తారు. తాజాగా ఈ హుండీని ఓపెన్ చేయగా.. అందులో రూ.100 కోట్ల విరాళం కనిపించింది. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఆలయ చరిత్రలోనే రూ.100 కోట్ల కానుక హుండీలో పడటం ఇదే ప్రథమం. దీంతో ఆలయ సిబ్బంది కూడా ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఆలయాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలా ? అని ఆలోచనలు చేశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట మీడియాకు చేరింది. మీడియా సిబ్బంది కొరకు ఈ విషయాన్ని ఆలయ సిబ్బందితో ప్రస్తావించారు. ఆలయ సిబ్బంది ఆ చెక్ వివరాల కోసం బ్యాంకును సంప్రదించారు. బ్యాంకు నుంచి వారు దిమ్మదిరిగే జవాబు విన్నారు. సదరు ఖాతాదారు పేరు బొడ్డెపల్లి రాధాకృష్ణకి చెందినదని బ్యాంకు అధికారులు చెప్పారు. ఆయన ఖాతాలో రూ.100 కోట్లు కాదు కదా.. 100 రూపాయలు కూడా లేవని చెప్పారు. ఆ ఖాతాలో రూ.17 మాత్రమే ఉన్నాయని వివరించారు. దీంతో ఆలయ సిబ్బంది ఖంగుతిన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news