ఫుట్‌బాల్‌ ఎందుకు బ్లాక్‌ అండ్‌ వైట్‌ కలర్‌లోనే ఉంటుంది..? కారణం కామెడిగా ఉందిగా..?

-

మనం రోజూ చూసేవి, చేసేవి అయినా వాటిని అలా ఏళ్ల తరబడి కానిచ్చేస్తుంటాం. చాలా తక్కువ మంది ఇలా ఇలానే ఎందుకు చేయాలి, ఇవి ఇలానే ఎందుకు ఉన్నాయి అని ఆలోచిస్తారు. అలా ఆలోచించే వాళ్లకు ప్రతిదీ ఆన్సర్‌ లేని ప్రశ్నగానే అనిపిస్తుంది. కానీ వాళ్లే ఎక్కువ తెలుసుకుంటారట. అసలు ముక్కు ముందే ఎందుకు పెట్టారు, వెనక పెడితే ఏం అయ్యేది, చెవులు రెండే ఎందుకు ఉన్నాయి, మూడు ఉండొచ్చుగా..? అలాగే స్పోర్ట్స్‌ విషయానికి వస్తే.. చస్‌, ఫుట్‌బాల్‌ అనాగానే మనకు ఆ నలుపు తెలుపు రంగులే గుర్తుకువస్తాయి. ఫుట్‌బాల్‌ ఎందుకు తెలుపు, నలుపు రంగుల్లోనే ఉంటుంది. బ్లూ, పింక్‌ ఇలా ఎందుకు పెట్టడం లేదు. అన్ని కంపెనీలు ఇలానే ఎందుకు చేస్తున్నాయి.. అసలు మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా..? అయితే ఆ ప్రశ్నకు సమాధానం మీకు ఇక్కడ దొరికేసింది..!!

ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రీడ. ప్రపంచంలోని ప్రతి మూలలో ఈ క్రీడకు ప్రత్యేకమైన అభిమానుల సంఖ్య ఉంది. ముఖ్యంగా క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ వంటి ప్రముఖ ఆటగాళ్లకు అభిమానులు కోట్లలో ఉన్నారు. ఫుట్‌బాల్ ఆట మాత్రమే కాదు.. వినోద క్రీడగా, కోట్లాది రూపాయలు ఆర్జించే క్రీడగా మారిపోయింది. క్లబ్‌లతో సహా వివిధ లీగ్‌లు కూడా ఎక్కువ అయ్యాయి. ఫుట్‌బాల్‌ ఆడే ఆటగాళ్లు ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తారు. ఇకపోతే ఫుట్ బాల్ కలర్ గురించి. ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే ఫుట్‌బాల్‌లో ఉపయోగించే బంతి ఆకారం పురాతన కాలం నుండి మారుతోంది.

చాలా మంది ఫుట్‌బాల్ రంగు మెుదటి నుంచి నలుపు, తెలుపు అని అనుకుంటారు. కానీ మెుదట్లో అది గోధుమ రంగులో ఉండేదని కొందరు చెబుతారు. అయితే బంతిని బ్లాక్ అండ్ వైట్‌లో ఎందుకు తయారు చేస్తారంటే..ఫుట్‌బాల్ బంతిని మెుదట్లో తోలుతో తయారు చేసేవారు. దాని రంగు చర్మం రంగును పోలి ఉండేది. ఇది గోధుమ రంగులో కనిపించేది. 1966 FIFA వరల్డ్ కప్ వరకు, బంతి గోధుమ రంగులోనే ఉండేది. క్రమంగా టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ప్రసారమయ్యాయి. వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ప్రసార సమయంలో బ్రౌన్ బాల్ కనిపించలేదు. ఆకర్షణీయంగా లేదు. బంతి ఆకర్షణీయంగా కనిపించకపోవడంతో నలుపు, తెలుపు రంగుల బంతిని తయారు చేయాలని నిర్ణయించారు.

నలుపు, తెలుపు రంగు ఫుట్ బాల్ 1970 ప్రపంచ కప్‌లో ఉపయోగించారు. బ్లాక్ అండ్ వైట్ బాల్.. ప్రేక్షకులకు టీవీలో బాగా కనిపించింది. కొత్తగా వచ్చిన బంతి డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉంది. అలా ఫుట్ బాల్ రంగు మారిందట. చాలా పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానం ఇలా సింపుల్‌, భలే ఉంటుంది కదా..! మార్కెటింగ్‌ కోసం ఇలాంటి జిమ్మిక్కులు కంపెనీలు చాలా చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news